Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ వద్దకు భారీగా చేరుకున్న అమరావతి రైతులు

  • మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన రైతులు
  • కాసేపట్లో పవన్‌తో రైతుల సమావేశం
  • ఏపీ ప్రభుత్వ వైఖరి, పోలీసుల లాఠీచార్జి వివరించనున్న రైతులు
ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ప్రభుత్వ వైఖరి, పోలీసుల లాఠీచార్జి చేసిన తీరుతో పాటు పలు విషయాలపై వారు పవన్ కల్యాణ్‌కు తెలిపి, తమ తరఫున పోరాడాలని కోరనున్నారు. కాసేపట్లో రైతులతో పవన్ చర్చించి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బీజేపీతో కలిసి పోరాడతామని ఇప్పటికే జనసేన పార్టీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ తీసుకున్న రాజధాని నిర్ణయం వైసీపీ వినాశనానికి నాంది అని పవన్ నిన్న మండిపడ్డారు.

Pawan Kalyan
Amaravati
Andhra Pradesh

More Telugu News