Vijay Sai Reddy: చిట్టినాయుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చేవాడు: విజయసాయిరెడ్డి
- అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ ప్రయత్నాలు చేశారు
- చంద్రబాబు ఏటా స్విట్జర్లాండ్ లోని దావోస్ సదస్సుకు వెళ్లేవాడు
- జపాన్, సింగపూర్, చైనా, కజకిస్థాన్‌కు లెక్కలేనన్ని సార్లు పర్యటనలు చేశారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి విషయంలో గతంలో వారు వ్యవహరించిన తీరును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
'అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ కోసం ఏటా స్విట్జర్లాండ్ లోని దావోస్ సదస్సుకు వెళ్లేవాడు చంద్రబాబు. చిట్టినాయుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చేవాడు. జపాన్, సింగపూర్, చైనా, కజకిస్థాన్, మలేషియా, థాయిలాండ్ లకు లెక్కలేనన్ని సార్లు పర్యటనలు చేశారు' అని విజయసాయిరెడ్డి ఆరోపణలు గుప్పించారు.