Kanna Lakshminarayana: ఎలుక దూరిందని ఇంటినే తగులబెడుతున్న జగన్: కన్నా సెటైర్లు!

  • బాబు మార్కు రాజకీయాలు చేస్తున్న జగన్
  • అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడివున్నాం
  • ట్విట్టర్ లో కన్నా లక్ష్మీనారాయణ
ఇంట్లో ఎలుక దూరిందని, మొత్తం ఇంటినే తగులబెట్టుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాలన ఉందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్లు పెట్టారు.

"ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టినట్లు ఉంది జగన్ పాలన. మీ ప్రభుత్వ నిర్ణయాలను సొంత నిర్ణయాలుగా చెప్పుకునే దమ్ము లేక కేంద్రంపై, బీజేపీపై నెపం నెట్టి బాబు మార్కు రాజకీయాలు చేస్తోంది వైసీపీ. బీజేపీ పరిపాలన వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉంది" అని అన్నారు. ఈ వ్యాఖ్యకు, గతంలో జగన్, చంద్రబాబు కరచాలనం చేసుకుంటున్న ఫోటోను కన్నా జోడించడం విశేషం.
Kanna Lakshminarayana
Chandrababu
Jagan
Twitter

More Telugu News