kala vankatrao: డొంకరోడ్డు గతుకుల్లో చంద్రబాబును తిప్పడం దుర్మార్గం: కళా వెంకట్రావు ఆగ్రహం

  • ఈ చర్య వెనుక ఆంతర్యం ఏంటి?
  • చంద్రబాబు, ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం హేయమైన చర్య
  • ముందస్తు తనిఖీ చేయని మార్గంలో ఆ వాహనాన్ని ఎలా తిప్పుతారు?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని మూడు గంటల పాటు తిప్పిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. డొంకరోడ్డు గతుకుల్లో చంద్రబాబు వాహనం తిప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? అని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు.

జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని గుంతల్లో తిప్పడం దుర్మార్గమని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు తనిఖీ చేయని మార్గంలో చంద్రబాబు ఉన్న వాహనాన్ని ఎలా తిప్పుతారు? అని ఆయన నిలదీశారు. ప్రభుత్వ తీరుసరికాదని విమర్శలు గుప్పించారు.
kala vankatrao
Telugudesam
Andhra Pradesh

More Telugu News