vijayasai Reddy: కిరసనాయిలుకు ఏపీ అనేది ఒక రాష్ట్రంగా కనిపించడం లేదు: విజయసాయిరెడ్డి

  • వందల కోట్లను దోచుకునే అవకాశాన్ని కోల్పోయామని బాధపడుతున్నారు
  • 5 కోట్ల మంది ప్రజలపై ద్వేషం పెంచుకున్నారు
  • ప్రభుత్వం, పాలన లేదంటూ చెత్త పలుకులు పలుకుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'బాస్' పదవి పోయినప్పటి నుంచి కిరసనాయిలుకు ఏపీ అనేది ఒక రాష్ట్రంగా కనిపించడం లేదని విమర్శించారు. వందల కోట్ల రూపాయలను దోచుకునే అవకాశం కోల్పోవడంతో... 5 కోట్ల మంది ప్రజలపై ద్వేషాన్ని పెంచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, పాలన లేదన్నట్టు చెత్త పలుకులు పలుకుతున్నారని ట్వీట్ చేశారు.

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏపీ అసెంబ్లీలో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
vijayasai Reddy
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News