Galla Jayadev: ఇండియా మ్యాప్ లో అమరావతికి చోటు కల్పించిన నాయకుడిని హింసిస్తారా?: సోమిరెడ్డి

  • గల్లా జయదేవ్ పై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు
  • పోలీసుల తీరును ఖండించిన సోమిరెడ్డి
  • గల్లాను హింసించడం దారుణమని వ్యాఖ్య
అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.

గల్లా జయదేవ్ తో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని సోమిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇండియా మ్యాప్ లో అమరావతికి చోటు కల్పించిన నాయకుడు గల్లా అని చెప్పారు. అలాంటి నాయకుడిని పోలీసులు దారుణంగా హింసించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను కొట్టడమే కాక, కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన సోమిరెడ్డి... గల్లా పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
Galla Jayadev
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Amaravati

More Telugu News