Pink: తన తదుపరి చిత్రం 'పింక్'లో పవన్ ఇలా... వైరల్ అవుతున్న చిత్రాలు!

  • 'అజ్ఞాతవాసి' తరువాత మరో చిత్రంలో నటించని పవన్
  • పూర్తి స్థాయి రాజకీయాలకు పరిమితం
  • నల్లటి గుబురు గడ్డంతో కొత్త సినిమాలో
'అజ్ఞాతవాసి' సినిమా తరువాత, మరో చిత్రంలో నటించకుండా, పూర్తి స్థాయి రాజకీయాలకు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తాజాగా, బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'పింక్' రీమేక్ లో నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లగా, పవన్ కల్యాణ్, సినిమాలో కనిపించే లుక్ ఇప్పుడు లీకైంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నల్లటి గుబురు గడ్డంతో పవన్ ఇందులో కనిపిస్తున్నారు.

దిల్ రాజు నిర్మాతగా వేణూ శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా రూపుదిద్దుకుంటోంది. 'అల వైకుంఠపురములో..' చిత్రానికి సూపర్ హిట్ పాటలను అందించిన ఎస్ఎస్ థమన్, ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చనున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్యా నాగల్ల, అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సినిమాను మేలో వేసవి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న పవన్ పిక్ లను మీరూ చూడవచ్చు.
Pink
Agnatavasi
Pawan Kalyan
viral
Photos
New Look

More Telugu News