Andhra Pradesh: మంత్రి అనిల్ మాట్లాడుతుంటే 'మాటలు' అందించిన వైసీపీ సభ్యుడు

  • సభలో ఆవేశాలు  
  • సీఎం మాట్లాడుతుండగా టీడీపీ సభ్యుల నినాదాలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్
సభలో ఇవాళ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుండడంతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. మంత్రి అనిల్ కుమార్ లేచి రౌద్రరూపం ప్రదర్శించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కు పక్కనే ఉన్న ఓ వైసీపీ సభ్యుడు మాటలు అందించడం వీడియోలో రికార్డయింది. సిగ్గులేని జన్మ అను, క్షమాపణ చెప్పాలని అడుగు, చరిత్రహీనుడిలా మిగిలిపోతావ్ అను... అంటూ మంత్రి అనిల్ కు ప్రాంప్టింగ్ చేశారు. ఆ సభ్యుడు సూచించిన మాటలనే ఉపయోగిస్తూ మంత్రి అనిల్ టీడీపీ సభ్యులపై రెచ్చిపోయారు.

Andhra Pradesh
Amaravati
Assembly
Anil Kumar Poluboina
YSRCP
Telugudesam
Chandrababu

More Telugu News