Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పదిహేడు మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

  • సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ
  • స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు
  • సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులు
ఏపీ అసెంబ్లీ నుంచి పదిహేడు మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, కరణం బలరాం, ఆదిరెడ్డి భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, వెంకటరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామినిలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
Andhra Pradesh
Assembly
Telugudesam
Suspend

More Telugu News