Telangana: రైతులకు శుభవార్త.... రబీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • పెట్టుబడి సాయం కింద రూ.5 వేలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • రబీ సీజన్ కోసం తాజాగా రూ.5,100 కోట్లు మంజూరు
  • ఖరీఫ్ లో రూ.6862 కోట్లు అందించిన వ్యవసాయ శాఖ
తెలంగాణలో రబీ, ఖరీఫ్ సీజన్లలో పంటలు వేసేందుకు రైతులకు రూ.5000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రబీ రైతుబంధు పథకం కోసం భారీగా నిధులు మంజూరు చేశారు. రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఖరీఫ్ లో పెట్టుబడి సాయం కింద రూ.6862 కోట్లు రైతులకు అందించారు. తాజాగా రబీ సీజన్ కోసం త్వరలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.
Telangana
Rabi
Khareef
Agriculture
Raithu Bandhu
TRS
KCR

More Telugu News