Andhra Pradesh: రాజధాని గ్రామాలకు బయల్దేరేందుకు పవన్ సన్నద్ధం... పార్టీ కార్యాలయం చుట్టూ మోహరించిన పోలీసులు

  • రాజధాని గ్రామాల్లో పర్యటించాలని పవన్ నిర్ణయం
  • పోలీసుల రాకతో జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు
అమరావతిలోని జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల దీక్షలు, అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పెనుమాక, ఎర్రబాలెం, మందడం ప్రాంతాల్లో పర్యటించాలని పవన్ నిర్ణయించుకున్నారు.

అయితే, భారీ సంఖ్యలో పోలీసులు జనసేన కార్యాలయం చుట్టూ మోహరించారు. పోలీసుల రాకపై జనసేన పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజధానిలో పోలీస్ చట్టం 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నందున వెళ్లొద్దని చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పవన్ బయల్దేరేందుకు కాన్వాయ్ సిద్ధం చేసిన నేపథ్యంలో జనసేన కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
Andhra Pradesh
Amaravati
AP Capital
Pawan Kalyan
Janasena
Police

More Telugu News