Vijay: 65వ సినిమాను కూడా లైన్లో పెట్టిన విజయ్

షార్ట్స్‌లో చూడండి
తమిళనాట విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య 'బిగిల్'తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 'మాస్టర్' టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా విజయ్ కెరియర్లో  64వ సినిమా. ఈ సినిమాలోనూ విజయ్ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే ఆయన తన 65వ సినిమాను లైన్లో పెట్టేశాడు. 'పాండిరాజ్' ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని సమాచారం. గతంలో 'కాడైకుట్టి సింగం'.. 'నమ్మ వీట్టు పిళ్లై' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఇటీవల విజయ్ ను కలిసి ఒక కథను వినిపించాడట. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
Vijay
Pandi Raj

More Telugu News