Botsa Satyanarayana Satyanarayana: గత టీడీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

  • అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలి
  • ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదు
  • ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల అవసరాలను గమనించాలి
గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని వ్యాఖ్యానించారు.

ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల అవసరాలను గమనించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. గత పాలకుల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రాంతాల అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.

శివరామకృష్ణన్ కమిషన్‌ నివేదికను గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పారు. హైపవర్ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని అన్నారు.  వికేంద్రకరణ వల్లే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు.
Botsa Satyanarayana Satyanarayana
Amaravati
Andhra Pradesh

More Telugu News