Crime News: యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు చిక్కిన ఐఎస్ఐ ఏజెంటు

  • మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో అరెస్టు 
  • చిట్టూపూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల రషీద్ గా గుర్తింపు 
  • ఆర్మీ బేస్ ల ఫొటోలు తీసి పాకిస్థాన్‌కు పంపుతున్నట్లు గుర్తింపు

ఉత్తరప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)కు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంటు చిక్కాడు. దేశంలోని ఆర్మీబేస్ ఫొటోలు తీసి ఇతను పాకిస్థాన్‌కు పంపిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఏజెంటు ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. చిట్టూపూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల రషీద్ అహ్మద్ గతంలో రెండుసార్లు పాకిస్థాన్లో పర్యటించి అక్కడి ఐఎస్ఐ ఏజెంట్లను కలిసి వచ్చాడని తేల్చారు. రషీద్ ను అరెస్టుచేసి ఇంటరాగేట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Crime News
Uttar Pradesh
ATS
ISI agent arrest

More Telugu News