Nara Lokesh: ఇప్పుడు నిజంగా ఈ జన ప్రవాహం అసెంబ్లీ ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని చూడండి: లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై గతంలో వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

'అమరావతిని కృష్ణమ్మ ముంచెత్తుతుందని వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేశారు. ఇప్పుడు నిజంగా ఈ జనప్రవాహం అసెంబ్లీ ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని చూడండి. మహిళలు, పిల్లలు సైతం ప్రభుత్వ నిర్బంధాలను ఛేదించుకుని ఎలా వెల్లువెత్తారో చూశాక కూడా ప్రభుత్వం మొండి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వం కాదా?' అని లోకేశ్ విమర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
YSRCP
Telugudesam
Amaravati

More Telugu News