Roja: అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్రూములేనా?: రోజా

  • అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేదు
  • చంద్రబాబు 29 గ్రామాలకు మాత్రమే ప్రతిపక్ష నేతా?
  • కూకట్ పల్లి నుంచి మహిళలను తీసుకొచ్చి నిరసనలు చేయిస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ... అక్కడి నుంచి అమరావతికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేదని చెప్పారు. అసెంబ్లీలో 151 మంది ఎమ్మల్యేలకు రెండు బాత్రూములేనా అని ప్రశ్నించారు.

అసలు చంద్రబాబు రాష్ట్రం మొత్తానికి ప్రతిపక్ష నేతా? లేక 29 గ్రామాలకు మాత్రమేనా? అని అడిగారు. కూకట్ పల్లి నుంచి మహిళలను తీసుకొచ్చి నిరసనలు చేయిస్తున్నారని విమర్శించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తారని చెప్పారు. చంద్రబాబు జోలె పట్టి అడుక్కుంటున్నారని... ప్రజా సమస్యలపై చంద్రబాబు ఏనాడైనా జోలె పట్టారా? అని ప్రశ్నించారు.
Roja
Chandrababu
Jagan
Telugudesam
YSRCP

More Telugu News