Nara Lokesh: 'ఆ కాంక్షే ప్రజల్ని అసెంబ్లీ వరకు తీసుకొచ్చింది' అంటూ వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

  • అసెంబ్లీ ముందు నిరసన తెలిపాం
  • పోలీసుల్ని దింపినా ఉద్యమాన్ని అణిచివేయడం సాధ్యం కాదు 
  • శాసనసభలో చేసిన తీర్మానాలకు విలువ లేదా? 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందు నిరసన తెలిపామని చెబుతూ టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రాజధాని ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించడం సరికాదని ఆయన హితవు పలికారు.

''ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని'... మూడు రాజధానులు వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. అనే నినాదంతో అసెంబ్లీ ముందు నిరసన తెలిపాం' అని లోకేశ్ అన్నారు.
 
'ఎంత మంది పోలీసుల్ని దింపినా ఉద్యమాన్ని అణిచివేయడం సాధ్యం కాదు. అమరావతిని కాపాడుకోవాలి అనే కాంక్ష ప్రజల్ని అసెంబ్లీ వరకు తీసుకొచ్చింది' అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. 

'శాసనసభలో చేసిన తీర్మానాలకు, చెప్పిన మాటలకు విలువ లేనప్పుడు ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం ఎక్కడ ఉంటుంది?' అని లోకేశ్ నిలదీశారు.
Nara Lokesh
Andhra Pradesh
Amaravati

More Telugu News