Buggana Rajendranath: అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని.. విశాఖలో సచివాలయం!: ప్రభుత్వ నిర్ణయాలను అసెంబ్లీలో వివరించిన బుగ్గన
- ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహల్స్ వంటి భవనాలు అవసరం లేదు
- ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రత
- ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోవట్లేదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహల్స్ వంటి భవనాలు అవసరం లేదు... ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రత. ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోవట్లేదు' అని అన్నారు.
'కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. కర్నూలులోనే న్యాయపరమైన అన్ని శాఖలు. హైకోర్టు అనుమతి తర్వాత ఇవి ఏర్పాటు చేస్తాం. ఇది చారిత్రాత్మక బిల్లు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌భవన్, సచివాలయం. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం చేయాలి. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లు. సమ్మిళిత అభివృద్ధి మన లక్ష్యం' అని బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు.