Amaravati: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వెలగపూడి ప్రజలు

  • పొలాల మధ్య నుంచి అసెంబ్లీ వైపు దూసుకువెళ్లిన వైనం
  • రైతులు, మహిళలను అడ్డుకున్న పోలీసులు
  • తమను రోడ్డున పడేస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  ఏపీ కేబినెట్‌ చేసిన తీర్మానాన్ని తాము అంగీకరించబోమని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఈ రోజు ఉదయం వెలగపూడి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కేబినెట్‌ నిర్ణయం వెలువడిన వెంటనే గ్రామంలోని రైతులు, మహిళలు భారీ సంఖ్యలో తమ నిరసన వ్యక్తం చేశారు.

పోలీసుల కళ్లుగప్పి పొలాల మధ్య నుంచి అసెంబ్లీ ముట్టడి కోసం బయలుదేరారు. దీన్ని గుర్తించిన పోలీసులు మధ్యలోనే వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, మహిళలు మాట్లాడుతూ రాష్ట్రం కోసం తాము తమ భూములు త్యాగం చేస్తే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణమని వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Amaravati
velagapudi
farmers
assembly muttadi

More Telugu News