Amaravati: దేవినేనిని కట్టడి చేసేందుకు పోలీసుల యత్నం.. కాసేపు ఉద్రిక్తత

  • పోలీసుల తీరును అడ్డుకున్న అనుచరులు
  • దీంతో ఇరువర్గాల మధ్య వివాదం
  • గొల్లపూడి సెంటర్‌లోని ఇంటివద్ద గందరగోళం
అమరావతి రైతు జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు తీసుకున్న చర్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు వెళ్లేందుకు వీలు లేదని ఆంక్షలు విధించారు. దీన్ని దేవినేనితోపాటు ఆయన అనుచరులు ప్రతిఘటించారు. తాము నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, దేవినేని అనుచరులకు మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Amaravati
devineni uma
house arrest
tension

More Telugu News