VarlaRamaiah: ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక నియంత పాలనా?: వర్ల రామయ్య

  • మన రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 అమలు నిలిపివేశారా?
  • భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తారా?
  • నిర్బంధ పాలన ఎందుకు కొనసాగిస్తున్నారు?
భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.  నిర్బంధాలు చేస్తూ పాలన ఎందుకు కొసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

'ముఖ్యమంత్రి గారు! మన రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 అమలు నిలిపివేశారా? భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తారా? ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక నియంత పాలనా? నిర్బంధ పాలన ఎందుకు సాగిస్తున్నారు? ప్రజలను ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారు? న్యాయస్థానాలు కూడా సుమోటోగా స్పందించాలని కోరుతున్నాం' అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
VarlaRamaiah
Jagan
YSRCP
Telugudesam

More Telugu News