Nara Lokesh: అంత పట్టుదల ఎందుకు?: జగన్ కు నారా లోకేశ్ ప్రశ్న

  • ఇంటికి పది మంది పోలీసులా?
  • పాకిస్థాన్ బోర్డర్ కన్నా ఎక్కువగా పోలీసులు
  • రాజధాని విభజన నిర్ణయంలో పసలేదన్న లోకేశ్
రాజధానిని తరలించాలని అంత పట్టుదల ఎందుకని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. "ఇంటికి పది మంది పోలీసులా? ఇళ్ల ముందు నెట్లు పట్టుకొని నిలబడటం ఏంటి? రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఎందుకు? పాకిస్థాన్ బోర్డర్ కంటే ఎక్కువగా రాజధాని గ్రామాల్లో పోలీసులను దింపుతారా?" అని ఆయన ప్రశ్నించారు. ఆపై "అడుగుకో పోలీసు, లాఠీలు, ముళ్ల కంచెలతో రాజధానిని తరలించాలి అనే పట్టుదల ఎందుకు? రాజధాని విభజన నిర్ణయంలో పసలేదు కాబట్టే వైకాపా ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది" అని ఆరోపించారు. 
Nara Lokesh
Twitter
Jagan
Amaravati

More Telugu News