Whatsapp: కాసేపు మొరాయించిన వాట్సాప్... యూజర్ల అసహనం!

  • వీడియోలు, ఫొటోలు పోస్టు కాకపోవడంతో యూజర్ అసంతృప్తి
  • ట్విట్టర్ లో ఫిర్యాదులు
  • రెండు గంటల పాటు అంతరాయం
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. సుమారు రెండు గంటల పాటు వాట్సాప్ సేవలు అందక యూజర్లు అసంతృప్తికి గురయ్యారు. వీడియోలు, జిఫ్ ఇమేజ్ లు, పిక్స్ పంపడం సాధ్యం కాకపోవడంతో యూజర్లు అసహనం చెందారు. సాయంత్రం 4 గంటల నుంచి వాట్సాప్ సేవలపై వినియోగదారులు ట్విట్టర్ లో ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. టెక్ట్స్ సందేశాలు పంపడం సాధ్యమైనా, వీడియోలు, ఫొటోలు మాత్రం పంపడం సాధ్యం కాలేదు. అయితే, వాట్సాప్ టీమ్ కొద్దిసేపటి తర్వాత సేవలను పునరుద్ధరించడంతో యూజర్లు శాంతించారు.
Whatsapp
Users
Photo
Video
Gif

More Telugu News