Andhra Pradesh: ప్రజల మధ్యలోంచి కాకుండా దొంగదారిలో వెళ్లేందుకు జగన్ కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నాడు: నారా లోకేశ్

  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
  • దున్నపోతు ప్రభుత్వం అంటూ విమర్శలు
  • రైతుల మరణాలు కలచివేస్తున్నాయంటూ ఆవేదన
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను వైఎస్ జగన్ చంపేస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ  రైతులను బలితీసుకుంటోందని, శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమంగా కేసులు పెట్టడంతో రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో మృతి చెందారని లోకేశ్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మహిళా రైతు సామ్రాజ్యమ్మ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషాద ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని, రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ఇలాంటి దయనీయ పరిస్థితి రావడం దారుణమని పేర్కొన్నారు. చేసేవి దొంగపనులు కావడంతో గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారని, ప్రజల మధ్యలోంచి కాకుండా దొంగదారిలో వెళ్లేందుకు జగన్ కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Amaravati
Telugudesam
Nara Lokesh
YSRCP
Jagan
Farmers

More Telugu News