peddareddi: వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో జేసీ దివాకర్‌రెడ్డి చెప్పాలి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి

  • ఆలయాల నిర్మాణం కోసం వచ్చే విరాళాలను కూడా స్వాహా చేశారు 
  • జేసీ సోదరుల ఓటమి తర్వాత తాడిప్రతిలో ప్రజాస్వామ్య పాలన
  • గ్రామాల్లో ముఠా కక్షలు రేపేందుకు జేసీ సోదరులు కుట్ర  
వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో జేసీ దివాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలని తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాలు విసిరారు. ఆలయాల నిర్మాణం కోసం వచ్చే విరాళాలను కూడా జేసీ దివాకర్‌ రెడ్డి స్వాహా చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జేసీ సోదరులు ఓటమి తర్వాత తాడిప్రతిలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందని చెప్పారు. గ్రామాల్లో ముఠా కక్షలు రేపేందుకు జేసీ సోదరులు కుట్ర చేస్తున్నారని అన్నారు. అవినీతికి చిరునామా జేసీ దివాకర్‌రెడ్డి అని ఆయన ఆరోపించారు. తాడిపత్రిలో మట్కా నిర్వహించింది జేసీ సోదరులేనని అన్నారు.


peddareddi
YSRCP
Telugudesam
JC Prabhakar Reddy

More Telugu News