Atchannaidu: టీడీపీ నేతలకు నోటీసులు.. మండిపడ్డ అచ్చెన్నాయుడు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు చేస్తోన్న అమరావతి రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.

శాంతిభద్రతలకు భంగం కలిగే కార్యక్రమాలు చేపడుతున్నారన్న సమాచారంతోనే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నోటీసుల జారీపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వచ్చి తమ ఇంటికి వచ్చి  నోటీసులు ఇచ్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.

పోలీసులు తనను నిరంతరం అనుసరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లే సభ్యులకు నోటీసులు ఇవ్వాలని ఏ చట్టం చెబుతోంది? అని నిలదీశారు. కాగా, రాజధాని విషయంపై  అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయనున్న ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.

Go Back to Shorts
Atchannaidu
Telugudesam
Amaravati

More Telugu News