Rahul Gandhi: రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన రాంచీ సివిల్ కోర్టు

  • దొంగల ఇంటి పేరు మోదీ అంటూ వ్యాఖ్యానించిన రాహుల్
  • కోర్టులో పిటిషన్ వేసిన ప్రదీప్ మోదీ
  • తాను ఎంతో ఆవేదనకు గురయ్యానంటూ వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా 'మోదీ దొంగ' అని చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాంచీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 22న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ వీరందరికీ కామన్ గా మోదీ అని ఎందుకుంది? ఎందుకంటే దొంగలందరి ఇంటి పేరు మోదీనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఇంకెంత మంది మోదీలు బయటపడతారో అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సివిల్ కోర్టులో భోపాల్ కు చెందిన ప్రదీప్ మోదీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు.

ఈ సందర్భంగా ప్రదీప్ మోదీ మాట్లాడుతూ, కావాలనుకుంటే మీరు సంబంధిత వ్యక్తుల పేర్లతో ఆరోపణలు చేసుకోవచ్చని... ఒక సామాజికవర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం సరి కాదని అన్నారు. తాను కోర్టుకు వచ్చినప్పుడు కూడా కొందరు మిత్రులు తనను హేళన చేశారని చెప్పారు. ఎంతో ఆవేదనకు గురైన తాను పరువునష్టం దావా వేశానని తెలిపారు.
Rahul Gandhi
Modi
Congress

More Telugu News