Pawan Kalyan: కేంద్రంలో బీజేపీ తీసుకునే నిర్ణయాల పట్ల జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలి: పవన్ కల్యాణ్

  • గ్రేటర్ హైదరాబాద్ నేతలతో పవన్ సమావేశం
  • అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే బీజేపీతో కలిశామని వెల్లడి
  • ఇరుపక్షాల నుంచి ఎలాంటి షరతులు లేవన్న జనసేనాని
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై స్పందించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, అభివృద్ధి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని బీజేపీతో కలిశామని చెప్పారు.

2014లోనూ బీజేపీతో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. అన్ని అంశాల గురించి లోతుగా ఆలోచించిన తర్వాతే పొత్తు ఖరారు చేశామని, ఇరువైపుల నుంచి ఎలాంటి షరతులు లేవని వెల్లడించారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకునే నిర్ణయాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, లేకపోతే అపోహలకు దారితీసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Pawan Kalyan
Janasena
Hyderabad
BJP
Andhra Pradesh
Telangana

More Telugu News