Shbana Ajmi: రోడ్డు ప్రమాదంలో నటి షబానా ఆజ్మీకి గాయాలు

  • పూనే నుంచి ముంబయి వస్తుండగా ప్రమాదం
  • అదుపుతప్పి ట్రక్కును ఢీకొన్న షబానా కారు
  • షబానా భర్త జావెద్ అక్తర్ కు స్వల్ప గాయాలు
ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ రోజు ముంబయి-పూణే ఎక్స్ ప్రెస్ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్హాపూర్ టోల్ ప్లాజా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో షబానా తీవ్రంగా గాయపడగా ఆమె భర్త జావెద్ అక్తర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని చూసిన స్థానికులు వారిని పాన్వెల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎం ఆస్పత్రి అధికారులు షబానా ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన చేస్తూ..‘ఆమెకు ముక్కుపై గాయాలయ్యాయి. ఇతర గాయాలు ఏమీ కనిపించడంలేదు. ప్రమాదం మూలంగా ఆమె షాక్ కు గురయ్యారు. చికిత్స కొనసాగుతోంది. పరిస్థితి నిలకడగా ఉంది’ అని చెప్పారు.
Shbana Ajmi
Road Accident
injured

More Telugu News