CRDA: సీఆర్డీఏ అంశంపై బుగ్గన, శ్రీకాంత్ రెడ్డిలతో సీఎం జగన్ కీలక సమావేశం

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై కృతనిశ్చయంతో ఉన్నట్టు తాజా పరిణామాల ద్వారా అర్థమవుతోంది. మూడు రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇప్పటికే సీఎం జగన్ తో సమావేశమై చర్చలు జరిపింది. ఇక మిగిలింది సీఆర్డీఏ చట్టం. రాజధానిని అమరావతి నుంచి తరలించాలంటే అనేక చిక్కుముడులతో కూడిన సీఆర్డీఏ చట్టం ప్రధాన అవరోధంగా పరిణమించే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ చట్టంపై చర్చించేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సీఆర్డీఏ విషయంలో న్యాయపరమైన, సాంకేతికపరమైన ప్రతిబంధకాలు రాకుండా ఎలా వ్యవహరించాలన్న విషయాలను సీఎం జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Go Back to Shorts
CRDA
Andhra Pradesh
Amaravati
YSRCP
Jagan

More Telugu News