Rajasthan: సర్పంచ్ గా ఎన్నికైన 97 ఏళ్ల పెద్దావిడ!

  • రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు
  • సమీప ప్రత్యర్థి మీనాపై 207 ఓట్ల మెజారిటీ
  • బరిలో మొత్తం 11మంది అభ్యర్థులు
రాజకీయాలకు వయసుతో పనేముందని రాజస్థాన్ లోని తొంబైఏడేళ్ల వృద్ధురాలు నిరూపిస్తోంది. ఇటీవల అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్ గా గెలిచి ఔరా అనిపించింది. రాష్ట్రంలోని సికర్ జిల్లా నీమ్కా ఠాణా పరిధిలోని పురాణావాస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన 97 ఏళ్ల విద్యాదేవి, తన సమీప ప్రత్యర్థి మీనాపై 207 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మొత్తం 11మంది పోటీ చేయగా, విద్యాదేవి వైపే ఓటర్లు మొగ్గారు. విద్యాదేవి భర్త గతంలో గ్రామ సర్పంచ్ గా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశారు. ఈ నేపథ్యంలో విద్యాదేవి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. తాజా ఎన్నికల్లో విజయం సాధించారు.
Rajasthan
97 years old woman
Sarpach
Elected

More Telugu News