Chandrababu: 'ఏ నివేదికైనా చిత్తుకాగితంతో సమానం' అంటూ ఓ కార్టూన్ ను పోస్ట్ చేసిన చంద్రబాబు

  • కమిటీలు ఎన్ని వేసినా అవన్నీ లాంఛనమే
  • వైసీపీ వాళ్లు అనుకున్నది చెప్పించేందుకే
  • అమరావతిపై విషం కుమ్మరించేందుకే
  • ఈ ప్రీ ప్రిపేర్డ్ నివేదికల నాటకాన్ని కట్టిపెట్టండి 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో జరుగుతోన్న గందరగోళంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. 'సీసాలు మారినా అందులో ఉండే గరళం మారనట్టు... కమిటీలు ఎన్ని వేసినా అవన్నీ లాంఛనమే, వాళ్లనుకున్నది చెప్పించేందుకే, అమరావతిపై విషం కుమ్మరించేందుకే. ఈ ప్రీ ప్రిపేర్డ్ నివేదికల నాటకాన్ని కట్టిపెట్టండి. ఆంధ్రుల రాజధాని అమరావతి ఒక్కటే' అని ఆయన ట్వీట్ చేశారు.
 
'రాజధానికి భూములిచ్చిన రైతులకు, మహిళలకు, రైతు కూలీలకు న్యాయం జరగని ఏ నివేదికైనా చిత్తుకాగితంతో సమానం' అని చంద్రబాబు విమర్శించారు. ఈ సందర్భంగా యథా రాజా తథా రిపోర్టు అంటూ ఓ కార్టూన్‌ను పోస్ట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాల మేరకే అన్ని రిపోర్టులూ ఉంటాయంటూ ముఖ్యమంత్రి జగన్‌, హైపవర్ కమిటీ, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలను ఉద్దేశిస్తూ ఆ కార్టూన్ ఉంది.
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News