Kodali Nani: ఎన్టీఆర్‌కి వైసీపీ నేత కొడాలి నాని నివాళులు

  • నేడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి 
  • తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే అన్న గారికి ఇవే నా నివాళులు
  • శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ చిత్రాన్ని పోస్ట్ చేసిన నాని
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ 24వ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌‌ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. మరోపక్క, టీడీపీ నేతలంతా ఎన్టీఆర్‌ చిత్రపటాలకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీ నేత, ఏపీ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు. 'తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే అన్న గారికి ఇవే నా నివాళులు' అని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంటూ శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్‌ అన్న ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు.
Kodali Nani
YSRCP
Telugudesam

More Telugu News