YSRCP: సినిమాలో పాత్రలను మార్చినట్లు.. పవన్ పార్టీలు మారుస్తున్నారు: రోజా

  • ప్యాకేజీల కల్యాణ్, పొత్తుల కల్యాణ్ గా మారారు
  • ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం ఎందుకు ఆపారో చెప్పాలి
  •  పవన్ లాంటి వారు యూత్ ఐకాన్ ఎప్పటికీ కాలేరు
బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ప్యాకేజీల కల్యాణ్, పొత్తుల కల్యాణ్ గా మారారని విమర్శించారు. రోజా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. పొత్తులు, ప్యాకేజీల కోసమే పవన్ పార్టీ పెట్టినట్లున్నారని చెప్పారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తాజాగా మారాయా? అని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ గతంలో పోరాటం చేసిన పవన్ తాజాగా పోరాటం ఎందుకు ఆపారో చెప్పాలని నిలదీశారు.

జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. పవన్ సినిమాలో పాత్రలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారన్నారు. పవన్ లాంటి వారు యూత్ ఐకాన్ ఎప్పటికీ కాలేరని పేర్కొన్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సీఎం రమేష్, సుజనాతో పాటు పవన్ ను ఎందుకు బీజేపీలోకి తీసుకున్నారో అర్ధం కావడంలేదని రోజా వ్యాఖ్యానించారు.
YSRCP
Roja
Criticism
Pawan Kalyan
BJP

More Telugu News