Andhra Pradesh: జగన్ తీరు దున్నపోతుపై వానపడినట్టుగా ఉంది: దేవినేని ఉమ

  • సీఎంపై ధ్వజమెత్తిన ఉమ
  • జగన్ ది మూర్ఖత్వమో, అహంకారమో ఆయనకే తెలియాలన్న ఉమ
  • జగన్ ఎలా గెలిచాడంటూ వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. జగన్ తీరు దున్నపోతుపై వాన పడిన చందంగా ఉందని విమర్శించారు. జగన్ ది మూర్ఖత్వమో, అహంకారమో ఆయనకే తెలియాలని అన్నారు. జగన్ గెలిచింది ఈవీఎంలతోనా? లేక ప్రజల ఓట్లతోనా? అని ప్రశ్నించారు.

పోతే, ఏపీ రాజధాని తరలింపు విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. పరస్పరం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. మరోవైపు అమరావతిలో రైతులు పట్టువిడవరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా వైసీపీపై దూకుడుగా వున్నారు. 
Andhra Pradesh
YSRCP
Jagan
Telugudesam
Devineni Uma
Amaravati

More Telugu News