Crime News: హాజీపూర్ బాలికల హత్య కేసులో ఈ నెల 27న తీర్పు

  • ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు
  • రెండు నెలలుగా కొనసాగిన విచారణ 
  • 100 మందికి పైగా సాక్షుల విచారణ
నల్గొండ జిల్లా హాజీపూర్‌లో బాలికల హత్యల కేసులో ఈ నెల 27న నల్లగొండ జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ న్యాయస్థానం (పోక్సో కోర్టు) తీర్పు వెలువరించనుంది. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.

రెండు నెలలుగా కొనసాగిన విచారణలో సాక్షులను, సాంకేతిక నిపుణులు చెప్పిన విషయాలను కోర్టు పరిశీలించింది. ప్రాసిక్యూషన్‌ ప్రవేశపెట్టిన 100 మందికి పైగా సాక్షులను విచారించింది. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణలో శ్రీనివాస్ రెడ్డి విచిత్రంగా స్పందించాడు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు 'కావచ్చు, నాకు తెలియదు, అంతా అబద్ధం' అనే మాటలు మాత్రమే చెప్పాడు.
Crime News
court

More Telugu News