Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు

  • సీనియర్ ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసంతో సీఎం అయ్యారు
  • ప్రజలకు నమ్మకం ఉంటే తారక్ కూడా సీఎం అవుతాడు
  • ప్రజల పట్ల ప్రేమ, నిబద్ధత ఉండాలి
తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత అభిమానమో చెప్పక్కర్లేదు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించాడు. ఆనాడు నిర్వహించిన ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఆయన రాజకీయపరంగా సైలెంట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో, తారక్ రాజకీయ జీవితంపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉంటే ఆయన తప్పకుండా సీఎం అవుతారని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని... ప్రజల పట్ల ప్రేమ, నిబద్ధత ఉంటే ఈ ఎన్టీఆర్ కూడా సీఎం అవుతాడని అన్నారు.
Junior NTR
Tarak
Posani Krishna Murali

More Telugu News