Andhra Pradesh: ఏపీ రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  • తెలంగాణలో చాలా జిల్లాల విభజన చేశాం
  • కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక కొంచం కూడా వ్యతిరేకత రాలేదు
  • ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాత్రం ఆందోళనలు చేస్తున్నారు
  • చాలా వ్యతిరేకత వస్తోంది, ఎందుకనేది ఆలోచించుకోవాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... తెలంగాణలో చాలా జిల్లాల విభజన చేశామని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక కొంచం కూడా వ్యతిరేకత రాలేదని చెప్పారు.

ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాత్రం ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. చాలా వ్యతిరేకత వస్తోందని, ఎందుకనేది ఆలోచించుకోవాల్సి ఉందని చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తుపై మీడియా ప్రశ్నించగా... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తే మాకేంటీ? అని ప్రశ్నించారు. ఆ విషయాలన్నింటినీ ఏపీ ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Amaravati
KTR
Telangana
TRS

More Telugu News