Jagan: ఏపీ సీఎం జగన్‌ నివాసంలో 'రాజధాని' హైపవర్ కమిటీ కీలక భేటీ

  • తాడేపల్లిలో సీఎం నివాసంలో చర్చలు
  • జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ
  • ప్రతిపాదనలపై సీఎంకు హైపవర్ కమిటీ ప్రజెంటేషన్‌
అమరావతి రాజధాని అంశంపై వచ్చిన నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ఈ రోజు కీలక భేటీలో పాల్గొంటోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఆ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సీఎంతో కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు.

ఇటీవల రాజధాని విషయంపై జీఎన్‌ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేసింది. రాజధానిపై వచ్చిన పలు ప్రతిపాదనలపై సీఎంకు హైపవర్ కమిటీ ప్రజెంటేషన్‌ ఇస్తోంది. రైతులు ఏమైనా చెప్పదల్చుకుంటే వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఇటీవల కమిటీ నిర్ణయం తీసుకుంది.
Jagan
Amaravati
Andhra Pradesh

More Telugu News