High Court: అమరావతిలో నిషేధాజ్ఞలపై ఏడు పిటిషన్లు.. విచారిస్తున్న హైకోర్టు

  • సెక్షన్ 144, పోలీసుల యాక్టు 30 అమలుపై హైకోర్టులో విచారణ
  • వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి 
  • విజయవాడ, రాజధాని గ్రామాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయడంపై పిటిషన్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసుల తీరుపై రైతులు మండిపడుతోన్న విషయం తెలిసిందే. రాజధాని కోసం నిరసన దీక్షలకు దిగుతోన్న రైతులు, మహిళలపై వారి తీరు పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. విజయవాడ, రాజధాని గ్రామాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయడంపై హైకోర్టులో పలువురి నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి.
 
 రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీసుల యాక్టు 30 అమలుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విషయాలపై రాజధాని మహిళలు, న్యాయవాదులు, రైతులు మొత్తం ఏడు పిటిషన్లు వేశారు. మరోవైపు, ఈ వ్యవహారాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే సుమోటోగా స్వీకరింఛి విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి విచారిస్తున్నారు.
High Court
Amaravati
Andhra Pradesh

More Telugu News