Vijay Sai Reddy: యాక్టర్ నిమిత్త మాత్రుడు.. ఆదేశించేది ఆయనే!: బీజేపీతో పవన్ పొత్తుపై విజయసాయిరెడ్డి స్పందన

  • ఆయనను నడిపించేది, వెనక నుంచి నెట్టేది '40 ఇయర్స్ ఇండస్ట్రీనే'
  • గతంలో కమ్యూనిస్టులతో కలిశారు, బీఎస్పీ కాళ్లు పట్టుకున్నారు
  • ఇప్పుడు కమలంతో కలిశారు
బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళతామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. పవన్ వెనుక ఉన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆయన అన్యాపదేశంగా ఆరోపణలు చేశారు. గతంలో కమ్యూనిస్టు పార్టీ, బీఎస్పీ.. ఇప్పుడు బీజేపీతో జనసేన కలవడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

'యాక్టర్ నిమిత్త మాత్రుడు. నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీనే. కమ్యూనిస్టులతో కలిసినా, బీఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది ఆయనే' అని ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Janasena
Pawan Kalyan

More Telugu News