Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,950, ప్రొద్దుటూరులో రూ.40,000, చెన్నైలో రూ.39,950గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,040, ప్రొద్దుటూరులో రూ.37,090, చెన్నైలో రూ.38,080గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,200, ప్రొద్దుటూరులో రూ.47,400, చెన్నైలో రూ.50,200 వద్ద ముగిసింది.