Telangana: ఎక్కడికక్కడ లోకల్ మేనిఫెస్టోలు... మున్సిపల్ అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం

  • తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి
  • టీఆర్ఎస్ అభ్యర్థులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
  • ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై క్లాస్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరం ఊపందుకుంది. పార్టీలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో స్థానిక అవసరాలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎక్కడికక్కడే లోకల్ మేనిఫెస్టోలు తయారుచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సరిగ్గా వివరించగలిగితే గెలుపు తథ్యమని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనల మధ్య తేడా చూసి ఓటెయ్యాలని ప్రజలను కోరాలని అభ్యర్థులకు సూచించారు.
Telangana
TRS
KTR
Muncipal Elections
KCR
Congress

More Telugu News