Madhya Pradesh: రూ.5 లక్షల బంగారు పతంగిని మెడలో ధరిస్తోన్న వ్యక్తి!

  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన పతంగి ప్రియుడు లక్ష్మీనారాయణ 
  • దారంలా చైనుని కూడా బంగారంతోనే చేయించిన వైనం
  • సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగరవేసిన లక్ష్మీనారాయణ
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.5 లక్షలతో చిన్న బంగారు పతంగిని లాకెట్ రూపంలో తయారు చేయించి మెడలో ధరించాడు. తాజాగా, అతడు విలేకరులకు తన పతంగిని చూపించాడు. లక్ష్మీ నారాయణ ఖండేవాల్(66)కి పతంగులంటే చాలా ఇష్టం కావడంతో ఇలా చేశాడు.

పతంగి, దానికి దారం కట్టే చెరాకును అతడు మీడియాకు చూపించాడు. దారంలా చైనుని కూడా బంగారంతోనే చేయించాడు. బారెడు మీసాలు, చేతికి బంగారు ఉంగరాలు పెట్టుకుని ఆయన ఉన్నాడు. ఆయన మెడలో మరిన్ని బంగారు చైన్లు కూడా ఉన్నాయి. ఇటీవల తన ఇంటిపై గాలిపటాలను ఎగరవేశాడు.
Madhya Pradesh
kite

More Telugu News