Crime News: హైదరాబాద్‌లో దారుణం.. పార్టీలో గొడవ.. స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన వైనం

  • సంక్రాంతి సందర్భంగా పార్టీ చేసుకున్న మిత్రులు 
  • మద్యం మత్తులో సుమన్ ని పొడిచిన స్నేహితుడు 
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి  
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా పార్టీ చేసుకోవాలని  కొందరు యువకులు ఒకే చోటకు చేరుకున్నారు. మద్యం తాగి ఎంజాయ్ చేద్దామని వచ్చారు. చివరకు పార్టీలో గొడవ పడి కత్తులతో పొడుచుకునే దాకా వెళ్లారు.

గత రాత్రి స్నేహితులంతా పార్టీ చేసుకుంటుండగా వారిలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని పోలీసులు ఈ రోజు మీడియాకు తెలిపారు. మద్యం మత్తులో సుమన్ అనే యువకుడిని అతడి స్నేహితుడు ఒకరు కత్తితో పొడిచాడని చెప్పారు. మిగతా స్నేహితులు సుమన్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారని, అయితే, మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు చెప్పారు.  
Crime News
Hyderabad
Police

More Telugu News