Nilanshi Patel: కురుల రాణి... 1.90 మీటర్ల జుట్టుతో గిన్నిస్ రికార్డు కొట్టేసిన గుజరాతీ యువతి!

  • పొడవైన కురులను కలిగివున్న టీనేజర్ గా నీలాన్షి
  • పాత రికార్డు బద్దలు
  • సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిని చూపుతున్న ప్రజలు
ఆమె పేరు నీలాన్షీ పటేల్. వయసు 17 సంవత్సరాలు. గుజరాత్ లోని అరవల్లి ఆమె స్వగ్రామం. తనేమీ పాప్యులర్ సెలబ్రిటీ కాదు. కానీ, ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఎగబడతారు. కారణం.. ఆమెకున్న పొడవాటి కురులే.

తన కురులను దాదాపు 1.90 మీటర్ల పొడవునా పెంచుకున్న నీలాన్షి పేరు ఇప్పుడు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. అత్యంత పొడవైన కురులను కలిగివున్న టీనేజ్ గర్ల్ గా ఆమె పేరుకు రికార్డుల్లో స్థానం కల్పించారు. 2018లో ఓ టీనేజ్ యువతి తన 170.50 సెంటీమీటర్ల పొడవైన కురులతో గిన్నిస్ రికార్డులకు ఎక్కగా, ఇప్పుడు నీలాన్షి ఆ రికార్డును సవరించింది. తన కురులు తనను ఓ సెలబ్రిటీని చేశాయని ఆమె సంబరంగా చెప్పుకుంటోందిప్పుడు.
Nilanshi Patel
Gujarath
Hair
Gunnis Record

More Telugu News