Amaravati: సీఆర్‌డీఏకు రాజధాని రైతుల నుంచి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు

  • రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ మొదలు
  • అభ్యంతరాలు ఇవ్వాలని ఇటీవల కోరిన ప్రభుత్వం
  • ఈనెల 17వ తేదీ వరకు సమయం
ఏపీ రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి. హైపవర్‌ కమిటీకి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపాలని ఇటీవల కోరిన విషయం తెలిసిందే. భూములు ఇచ్చిన రైతులు తమ విజ్ఞప్తులు ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్‌ పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు 3100 మంది రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.  ఈనెల 17వ తేదీ వరకు ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు.

Amaravati
CRDA
rythulu

More Telugu News