Vijay Sai Reddy: అందుకే చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉంది: విజయసాయిరెడ్డి

  • రియల్ ఎస్టేట్ లో లాభాలు రావడం కష్టమని చంద్రబాబు ఇలా చేశారు
  • ఆయన కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉండి పోయింది
  • పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదు  
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సంక్రాంతి పండుగను జరుపుకోకుండా చంద్రబాబు కుటుంబం అమరావతి రైతుల దీక్షకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి పలు ఆరోపణలు చేశారు.

'పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని చంద్రబాబు నాయుడి కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉండి పోయింది. పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదు' అని విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.

'ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా చంద్రబాబూ? భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్ ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా? రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా? 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ?' అని విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Amaravati

More Telugu News