Andhra Pradesh: తుళ్లూరులో రైతు దంపతుల కాళ్లు కడిగిన కొండవీటి జ్యోతిర్మయి

ఏపీ రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాజధాని రైతుల పోరాటానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా, ప్రవచనకర్త, గాయకురాలు కొండవీటి జ్యోతిర్మయి కూడా రైతులకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజధాని విషయంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్లాడుతున్న అమరావతి రైతులకు ఆ దేవుడి సాయం తప్పక అందుతుందని అన్నారు. కష్టకాలం నుంచి రైతులకు తప్పక ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రవచనాలు చెప్పి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసిన కొండవీటి జ్యోతిర్మయి ఓ రైతు దంపతుల కాళ్లు కడిగి, రైతుల త్యాగాలను స్మరించుకున్నారు.
Andhra Pradesh
Amaravati
Farmers
Kondaveeti Jyothirmayee

More Telugu News