Andhra Pradesh: ఏపీ మంత్రి తానేటి వనిత కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

  • పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో విషాదం
  • కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం
  • బైక్ ను వెనుకనుంచి ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ వాహనం
పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి తానేటి వనిత కాన్వాయ్ లోని వాహనం ఢీకొని కలసూరి వెంకటరామయ్య అనే వృద్ధుడు మరణించాడు.

 భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో వెంకటరామయ్య బైక్ పై వెళుతుండగా మంత్రి కాన్వాయ్ లోని వాహనం వెనుకనుంచి ఢీకొట్టింది. దాంతో తీవ్రగాయాలపాలైన వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో మంత్రి తానేటి వనిత ప్రయాణిస్తున్న వాహనం కూడా అదుపుతప్పి డివైడర్ మీదకు దూసుకెళ్లింది. మంత్రికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. కాగా మృతుడు వెంకటరామయ్య స్వస్థలం భీమవరం అని పోలీసులు గుర్తించారు.
Andhra Pradesh
YSRCP
Thaneti Vanitha
West Godavari District
Bhimadolu
Road Accident

More Telugu News